Jagtial: సర్వే నెం. 138 భూమిని 22-A నిషిద్ధ జాబితాలో చేర్చాలి!

Jagtial: జగిత్యాల పట్టణంలోని సర్వే నెం. 138 ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుండి కాపాడి, 22-ఏ నిషిద్ధ జాబితాలో చేర్చాలని మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ANAND, JAGITYAL
Published on: 10 Nov 2026 4:55 PM IST
Jagtial
X

Jagtial: సర్వే నెం. 138 భూమిని 22-A నిషిద్ధ జాబితాలో చేర్చాలి!

Jagtial: జగిత్యాల పట్టణం మరియు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 138 ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని మరియు వాటిని భూ భారతి చట్టానికి అనుగుణంగా P.O.B Section 22-A నిషిద్ధ జాబితాలో చేర్చాలని మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గారికి లేఖ ద్వారా వినతిపత్రం సమర్పించారు.

కోర్టు తీర్పులను బేఖాతరు చేస్తూ మున్సిపల్ స్థలం ఆక్రమణ:

సర్వే నంబర్ 138 లోని 0-20G భూమికి సంబంధించి గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పులను, మున్సిపల్ నిబంధనలను ఉల్లంఘించి ఆక్రమణలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఏళ్ల తరబడి యజమాన్య హక్కులు ధృవీకరించబడనప్పటికీ, సంబంధిత మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

మున్సిపాలిటీ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలి:

కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుండి మెమో ఆదేశాలు జారీ అయినప్పటికీ, ఆక్రమణకు గురైన మున్సిపల్ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడంలో స్థానిక యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా జిల్లా రెవెన్యూ అధికారులు స్పందించి:

సర్వే నెం. 138 లోని మొత్తం భూమిని 22-A నిషిద్ధ జాబితాలో చేర్చాలని,

మున్సిపాలిటీకి చెందిన 0-20G విస్తీర్ణంలో ఉన్న ఆక్రమిత భూమిని తిరిగి మున్సిపాలిటీ స్వాధీనం చేసుకునేలా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ వినతిపత్రం ప్రతులను రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO), తహసిల్దార్ మరియు మున్సిపల్ కమిషనర్లకు పంపినట్లు ఆయన వెల్లడించారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL