Karimnagar: మహిళా రక్షణ చట్టాలను అమలు చేయాలి: ఎస్ఎఫ్ఐ డిమాండ్

Karimnagar: మహిళా రక్షణ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, కళాశాలల వద్ద షీ టీమ్స్ నిఘా పెంచాలని కరీంనగర్ ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కమిటీ సమావేశంలో నాయకురాళ్లు డిమాండ్ చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Updated on: 6 Nov 2026 4:37 PM IST
Karimnagar
X

Karimnagar: మహిళా రక్షణ చట్టాలను అమలు చేయాలి: ఎస్ఎఫ్ఐ డిమాండ్

కరీంనగర్: భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) జిల్లా గర్ల్స్ కమిటీ సమావేశం సంజన అధ్యక్షతన మంకమ్మతోటలోని SFI జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా మానస మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రోజురోజుకూ మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని, ముఖ్యంగా విద్యార్థినులపై ఇటీవల కాలంలో అనేక దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు.

నిర్భయ చట్టం, అభయ చట్టం వంటి మహిళా రక్షణ చట్టాలపై విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. చట్టాలపై సరైన అవగాహన లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఆకతాయిలు మహిళలు, విద్యార్థినులపై వేధింపులకు, దాడులకు పాల్పడుతున్నారని అన్నారు.అదేవిధంగా కళాశాలల పరిసరాల్లో విద్యార్థినుల భద్రత కోసం షీ టీమ్స్‌ను అందుబాటులో ఉంచాలని, పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో SFI నాయకులు కృప, అశ్విని, సిరివెన్నెల, అమూల్య, సాత్విక, సుస్మిత, మధులత తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN