Manthani: 22A భూమికి అక్రమ పట్టా - కలెక్టర్ లాగిన్ ఆడిట్ బయటపెట్టాలని డిమాండ్!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథనిలో 22A నిషేధిత భూమికి అక్రమంగా పట్టా చేశారని రాజగోపాల్ ఆరోపణ. కలెక్టర్ లాగిన్ ఆడిట్ వివరాలు బయటపెట్టాలని డిమాండ్.

SHANKAR, MANTHANI
Published on: 28 Sept 2026 5:50 PM IST
Manthani
X

Manthani: 22A భూమికి అక్రమ పట్టా - కలెక్టర్ లాగిన్ ఆడిట్ బయటపెట్టాలని డిమాండ్!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన సర్వే నం. 94/B (ఇంటి నం. 2-5/A)లోని తన రేకుల పెడ్డును కూల్చివేసి నష్టం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని మంథని రాజగోపాల్ సోమవారం ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు. 94/D లో జంబోజి శంకరయ్యకు పట్టా ఇచ్చేందుకు ఉపయోగించిన కలెక్టర్ లాగిన్ ఆడిట్ వివరాలు బయటపెట్టాలని కోరారు. సర్వే నం. 94లో 7 అక్రమాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

నాలా పన్ను లేకుండా గృహ నిర్మాణ అనుమతులు, 788/1982 తప్పుడు రిజిస్ట్రేషన్, 40 ఏళ్లుగా సువర్ణ అమృత పేరుపై ఉన్న 94/D భూమికి యాజమాన్యం లేకుండానే పట్టా, 22A నిషేధిత జాబితాలో ఉన్నా పట్టా చేయడం, రూ.82 లక్షల భూమిని రూ.5.62 లక్షలకు చూపి స్టాంప్ డ్యూటీ ఎగవేత, తహసీల్దార్ సిఫారసు లేకుండా కలెక్టర్ లాగిన్ తో పట్టా చేయడం జరిగిందన్నారు. తనకు న్యాయం చేసి సబ్ డివిజనల్ సర్వే చేయించాలని పెద్దపల్లి కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI