Illanthakunta: ముస్కాణిపేట ఆలయాల్లో హుండీ చోరీ: ఇద్దరు నిందితుల అరెస్ట్
Illanthakunta: ముస్కాణిపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, ఎల్లమ్మ ఆలయాల్లో హుండీలను పగలగొట్టి చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను ఇల్లంతకుంట పోలీసులు అరెస్ట్ చేశారు.
Illanthakunta: ముస్కాణిపేట ఆలయాల్లో హుండీ చోరీ: ఇద్దరు నిందితుల అరెస్ట్
Illanthakunta: ఇల్లంతకుంట మండలం ముస్కాణిపేట గ్రామ శివార్లలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఎల్లమ్మ గుడిలో హుండీ చోరీకి పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ నెల 6వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 6 గంటల మధ్య గుర్తుతెలియని వ్యక్తులు ఆలయాల్లోకి ప్రవేశించి హుండీ తాళాలు పగలగొట్టి నగదు, ఆభరణాలను దొంగిలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన ఇల్లంతకుంట ఎస్‌ఐ ఎం. ఉపేంద్రచారి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు.
సీసీటీవీ ఆధారంగా ఎర్రనర్సుపల్లి గ్రామానికి చెందిన రాగుల అనిల్, పల్లె వేణుగా నిందితులను గుర్తించారు. వారిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ ఎం. ఉపేంద్రచారి మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ, నిందితులను గుర్తించడంలో సీసీటీవీ కెమెరాలు కీలకంగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఇళ్లు, వ్యాపార సంస్థలు, ఇతర ముఖ్య ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.




