Illanthakunta: ఇల్లంతకుంట శ్రీకృష్ణ గోశాలలో గరుకు స్తంభం ప్రతిష్ఠ

Illanthakunta: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట శ్రీకృష్ణ గోశాలలో కరీంనగర్‌కు చెందిన అన్నేమల్ల రాజేందర్ కుమార్ గరుకు స్తంభాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక అభిషేకం చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 2 Oct 2026 7:44 PM IST
Illanthakunta
X

Illanthakunta: ఇల్లంతకుంట శ్రీకృష్ణ గోశాలలో గరుకు స్తంభం ప్రతిష్ఠ

ఇల్లంతకుంట: శ్రీకృష్ణ గోశాలలో కరీంనగర్‌కు చెందిన అన్నేమల్ల రాజేందర్ కుమార్ గరుకు స్తంభాన్ని ఏర్పాటు చేసి అభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజేందర్ కుమార్ మాట్లాడుతూ.. ఇల్లంతకుంట శ్రీకృష్ణ గోశాలలో గరుకు స్తంభం ఏర్పాటు చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. గోసేవ చేయడం ద్వారా ముక్కోటి దేవతలకు పూజ చేసినంత ప్రతిఫలం లభిస్తుందని పేర్కొన్నారు. గోవుల సంరక్షణ, గోశాల అభివృద్ధికి ఎల్లవేళలా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పురోహితులు సాయి సందీప్ శర్మ, నాగలింగం శర్మ, గోశాల నిర్వహణ కమిటీ అధ్యక్షులు అయ్యన్నగారి హరికృష్ణ రెడ్డి, కునబోయిన బాలరాజు, సంరక్షకులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA