Illanthakunta: పేద ఆడబిడ్డ వివాహానికి బీటీఆర్ ఫౌండేషన్ కళ్యాణ కానుక!

Illanthakunta: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన పేద కుటుంబ ఆడబిడ్డ చైతన్య వివాహానికి బీటీఆర్ ఫౌండేషన్ తరఫున బెంద్రం తిరుపతి రెడ్డి రూ.10 వేల టేకు మంచాలను అందించారు.

KALEEM, SIRICILLA
Published on: 21 Nov 2026 5:09 PM IST
Illanthakunta
X

Illanthakunta: పేద ఆడబిడ్డ వివాహానికి బీటీఆర్ ఫౌండేషన్ కళ్యాణ కానుక!

ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన పేద కుటుంబానికి చెందిన దాసరి నరసింహ రాములు, అనంతలక్ష్మి దంపతుల కుమార్తె చైతన్య వివాహం సందర్భంగా బీటీఆర్ (Bendram Thirupathi Reddy) ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.10 వేల విలువైన టేకు మంచాలను అందజేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బెంద్రం తిరుపతి రెడ్డి ఈ కళ్యాణ కానుకను వధువు కుటుంబానికి అందించారు.

ఈ సందర్భంగా బెంద్రం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. మండలంలోని పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు తమ ఫౌండేషన్ తరఫున ఎల్లప్పుడూ కళ్యాణ కానుకలు, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సేవా ప్రతినిధులు తిప్పరపు వంశీ, మామిడి హరీశ్, పైసా ఆనంద్, దురుముట్ల స్వామి, ఉప్పులేటి ప్రశాంత్, జట్టు బాబు, దాసరి ఆంజనేయులు, దాసరి రవి, సింగారం మల్లేశం, సుద్దాల లక్ష్మి, దాసరి సుజాత, కొమురయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA