Sircilla: కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఇల్లంతకుంట మండల ప్రజలు!

Sircilla: ఇల్లంతకుంట మండలం చింతలకుంటలో నూతన కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మండల ప్రజలు, బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

KALEEM, SIRICILLA
Published on: 27 Oct 2026 11:35 AM IST
Sircilla
X

Sircilla: కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఇల్లంతకుంట మండల ప్రజలు!

Sircilla: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్‌కు ఇల్లంతకుంట మండల ప్రజల తరఫున బీజేపీ నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

నిన్న ఇల్లంతకుంట మండలంలోని చింతలకుంట గ్రామంలో నూతన కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమానికి బండి సంజయ్ కుమార్ హాజరై, కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఆనందాన్ని కలిగించిన ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రజల అభివృద్ధి, గ్రామాల ప్రగతి పట్ల బండి సంజయ్ చూపిస్తున్న చొరవ అభినందనీయమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్న ఆయన నాయకత్వం ప్రశంసనీయమని తెలిపారు.

ఇల్లంతకుంట మండలానికి విచ్చేసి చింతలకుంట గ్రామ కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా బీజేపీ ఇల్లంతకుంట మండల నాయకులు చిమ్మనగొట్టు శ్రీనివాస్, మాజీ మండల ఉపాధ్యక్షుడు బత్తిని స్వామి, తిప్పారం శ్రావణ్, పుణ్య సంపత్, శ్రీకాంత్, గుంటి మహేష్, గురుముట్ల కనకయ్య తదితరులు ధన్యవాదాలు తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA