Huzurabad: నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ పోలీసులు.. పర్స్ అప్పగింత
Huzurabad: హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పోగొట్టుకున్న పర్స్‌ను యజమానికి సురక్షితంగా అందజేసి నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ పోలీసులు శ్రీనివాస్, సంపత్.
Huzurabad: నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ పోలీసులు.. పర్స్ అప్పగింత
హుజూరాబాద్: విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధతకు నిదర్శనంగా నిలిచారు హుజూరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎం.డి. అంకుశావలి గారు తన పర్స్ పోగొట్టుకోగా, విధుల్లో ఉన్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుళ్లు హెచ్‌జీ శ్రీనివాస్, హెచ్‌జీ సంపత్‌లకు ఆ పర్స్ లభించింది.
వెంటనే స్పందించిన వారు పర్స్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి ఎస్‌ఐ రవి గారి ఆధ్వర్యంలో పర్స్‌లో ఉన్న వ్యక్తిగత కార్డులు, నగదుతో సహా దాని యజమాని ఎం.డి. అంకుశావలి గారికి సురక్షితంగా తిరిగి అప్పగించారు.
విధి నిర్వహణలో నిజాయితీ, బాధ్యతాయుతమైన ప్రవర్తనను చాటుకున్న హెచ్‌జీ శ్రీనివాస్, హెచ్‌జీ సంపత్‌లను అభినందిస్తున్నారు. వారి సేవలు పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావడంతో పాటు ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకాన్ని మరింత పెంచాయని పలువురు ప్రశంసిస్తున్నారు.




