Huzurabad: రాంపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం.. రూ.3కే 5 లీటర్లు
Huzurabad: హుజూరాబాద్ మండలం రాంపూర్‌లో జయన్న ఫౌండేషన్ మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం; రూ.3కే 5 లీటర్ల శుద్ధి నీరు, గ్రామస్తులకు ఉచిత వాటర్ కార్డుల పంపిణీ.
Huzurabad: రాంపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం.. రూ.3కే 5 లీటర్లు
హుజూరాబాద్: హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామంలో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఫౌండేషన్ వ్యవస్థాపకులు జైపాల్ రెడ్డి, చైర్మన్ సరిత దంపతులు ఆదివారం ప్రారంభించారు. రూ.3కే 5 లీటర్ల శుద్ధి నీటిని అందించడంతో పాటు గ్రామస్తులకు రూ.100 బ్యాలెన్స్‌తో ఉచిత వాటర్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో 24 గంటలు పనిచేసే ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 7 వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 1,300 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించడంతో పాటు వేలాది మందికి వైద్య సేవలు అందించామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వాటర్ ప్లాంట్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
త్వరలో రాంపూర్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడంతో పాటు, గ్రామస్తుల అవసరార్థం అంతిమయాత్ర రథాన్ని ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చారు.
చైర్మన్ సరిత మాట్లాడుతూ చెల్పూర్, సింగాపూర్, సిర్సపల్లి, కాట్రపల్లి, రాజపల్లి, రాంపూర్ గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజలకు సేవలందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముశం సంగీత గణేష్, వన్నాల శివాజీ, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.




