Gambhiraopet: కవితక్క సిద్ధాంతాలతో టీఆర్ఎస్‌లో భారీ చేరికలు: సుమలత

Gambhiraopet: గంభీరావుపేట మండలం గోరంటాలలో తెలంగాణ రక్షణ సేన పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి; సుమలత శర్మ, మజీద్ కొత్తవారికి గులాబీ కండువాలు కప్పారు.

KALEEM, SIRICILLA
Published on: 27 Sept 2026 7:30 PM IST
Gambhiraopet
X

Gambhiraopet: కవితక్క సిద్ధాంతాలతో టీఆర్ఎస్‌లో భారీ చేరికలు: సుమలత

గంభీరావుపేట: తెలంగాణ రక్షణ సేన అధినేత కవితక్క ఒక సంకల్పంతో రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని, ఆమె సిద్ధాంతాలు నచ్చి టీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సంకెపెల్లి సుమలత శర్మ, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ మజీద్ అన్నారు.

గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామంలో నియోజకవర్గ యువజన నాయకుడు సయ్యద్ జావిద్, గోరంటాల గ్రామ శాఖ నాయకుడు బందెల రాజు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా సుమలత శర్మ, మజీద్ పార్టీ కండువాలు కప్పి కొత్తగా చేరిన వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కవితక్క టీఆర్ఎస్ పార్టీని స్థాపించి నాలుగు నెలలు పూర్తవుతున్న సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కవితక్క చేస్తున్న ఉద్యమాలకు ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారు కవితక్కను ముఖ్యమంత్రిగా చూడటమే తమ లక్ష్యమని చెబుతున్నారని, ఇది అభినందనీయమని అన్నారు.

గంభీరావుపేట నాయకులు కూర సురేష్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సంకెపెల్లి సుధాకర్ శర్మ, ముస్తాబాద్ మండల నాయకుడు మార్వాడి దేవరాజు, బైరి రాజేష్, కొర్రి రమేష్, సిద్ధూ, చరణ్, సతీష్, నియోజకవర్గ మహిళా నాయకురాలు కదిరే రేణుక, ఆకారం పుష్పలత, ముత్తవ్వ, పద్మ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA