Godavarikhani: గోదావరిఖనిలో ఉద్రిక్తత: కేటీఆర్ పైలాన్ తొలగింపుపై ధర్నా

Godavarikhani: గోదావరిఖని గాంధీనగర్‌లో కేటీఆర్ ప్రారంభించిన పైలాన్‌ను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ ధర్నా చేపట్టింది.

VIJAY, RAMAGUNDAM
Published on: 3 Nov 2026 7:01 PM IST
Godavarikhani
X

Godavarikhani: గోదావరిఖనిలో ఉద్రిక్తత: కేటీఆర్ పైలాన్ తొలగింపుపై ధర్నా

పెద్దపల్లి జిల్లా: గోదావరిఖని గాంధీ నగర్ పైలాన్ సెంటర్ వద్ద బిఆర్ఎస్ నాయకుల ఆందోళన చేపట్టారు. రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన పైలాను మున్సిపల్ అధికారులు తొలిగించారు. మాజీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించిన పైలాన్ సెంటర్ ను తొలగించడంపై నిరసన వ్యక్తం చేస్తూ క్రేనుకు అడ్డంగా బయట నుంచి నిరసన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ నాయకులకు సమాచారం ఇవ్వకుండా పైలాన్ తోలించడం పై మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు బిఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పైలాన్ ఎందుకు తొలగిస్తున్నారు స్పష్టం చేయాలంటూ ఇన్చార్జి కమిషనర్ వచ్చేంతవరకు ధర్నా విరమించేది లేదంటూ చందర్ పేర్కొన్నారు.

క్రేన్ ద్వారా అక్కడి నుండి మరో ప్రాంతానికి తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్ ఫైలాన్ గ్యాస్ కట్టర్ తో కట్ చేసి క్రేన్ ద్వారా మరో చోటికి తలపించే ప్రయత్నం చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, BRS రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి, కౌశిక హరి లు తీవ్రంగా వ్యతిరేకించారు.

ఫైలాన్ తొలగింపుపై రామగుండం ఇంచార్జీ కమీషనర్ ఇక్కడకు రావాలని, సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఫైలాన్ ను అక్కడికి నుండి తరలించకుండా క్రేన్ కు అడ్డంగా బైఠాయించారు.

దీంతో గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఇంచార్జీ కమీషనర్ అరుణశ్రీ కి ఫోన్ చేసి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో మాట్లాడించారు. ఫైలాన్ కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీస్ లు చేసిన ఫిర్యాదు తోనే ఆర్ అండ్ బి పర్మిషన్ తో ఫైలాన్ ను తొలగించడం జరుగుతుందని సమాధానం చెప్పగా, ఒక ఫైలాన్ కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుతున్నాయా. ఇతర కూడళ్ళలో ఉన్న మిగతా విగ్రహాల కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరగడం లేదా అంటూ మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు.

అసలు దీనిపై కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేశారా అని అడగగా తీర్మానం చేయలేదని కమిషనర్ తెలిపారు. ఇది ముమ్మాటికి రాజకీయ కోణంలోనే కావాలనే తొలగించడం జరుగుతుందని ఇందుకు BRS పార్టీ అంగీకరించదని తెలిపారు. కొత్తగా నిర్మాణం చేసే అంబేద్కర్ పార్క్ లో పెట్టడం జరుగుతుందని తెలుపగా, అప్పటి వరకు ఇక్కడే ఉండనివ్వండనీ, లేదా తమకు ఫైలాన్ కు పార్క్ లో ఏర్పాటు చేస్తామని ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు.

దాదాపు 3 గంటల పాటు BRS పార్టీ నాయకులు రోడ్డుపైనే బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, BRS రాష్ట్ర నాయకులు కౌశిక హరి, వ్యాల్ల హరీష్ రెడ్డి లను పోలీస్ వాహనంలో ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేయగా BRS నాయకులు వాహనానికి అడ్డుపడడంతో తోపులాట, ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నేతృత్వంలో BRS నాయకులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. పోలీసులు BRS నాయకుల తోపులాట నడుమ చివరకు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, BRS రాష్ట్ర నాయకులు కౌశిక హరి వ్యాల్ల హరీష్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్, మరికొంతమంది BRS నాయకులను జైపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

VIJAY, RAMAGUNDAM

VIJAY, RAMAGUNDAM