Vemulawada: హైదరాబాద్‌లో వేములవాడ ఆలయ ఉన్నత స్థాయి భేటీ

Vemulawada: హైదరాబాద్ ప్రజాభవన్‌లో 2027 పండుగల తేదీల ఖరారుపై అర్చకుల భేటీ జరిగింది. వేములవాడ ఆలయ అభివృద్ధి పనులను ఈవో రమాదేవి వీటీడీఏ అధికారులతో సమీక్షించారు.

BABU, VEMULAWADA
Published on: 10 Nov 2026 7:10 PM IST
Vemulawada
X

Vemulawada: హైదరాబాద్‌లో వేములవాడ ఆలయ ఉన్నత స్థాయి భేటీ

​వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన పలు కీలక సమావేశాలు మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.

​హైదరాబాదులోని ప్రజాభవన్‌లో తెలంగాణలోని ప్రముఖ దేవాలయాల స్థానాచార్యులు, ముఖ్య అర్చకులతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాబోయే 2027 సంవత్సరానికి సంబంధించిన వివిధ పండుగల తేదీలను అధికారికంగా నిర్ణయించడంపై చర్చించారు.

​ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీమతి శైలజా రామయ్య (IAS) గారు , దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ హనుమంతు రావు (IAS) గారు , దేవాదాయ ధార్మిక అడ్వైజర్ శ్రీ గోవింద హరి గార్లతో వేములవాడ ఆలయ అర్చకులు, వేద పండితులు కలిసి స్వామివారి శేష వస్త్రాలు, లడ్డూ ప్రసాదం మరియు నూతన 2027 క్యాలెండర్‌ను అందజేశారు.

​VTDA అధికారులతో అభివృద్ధి పనుల సమీక్ష:

అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీమతి ఎల్. రమాదేవి గారు , వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (VTDA) అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిపై ఈ సందర్భంగా చర్చించారు.

​ఈ కార్యక్రమాల్లో ఆలయ ముఖ్య అర్చకులు, స్థానాచార్యులు, వేద పండితులు మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA