Sircilla: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సిరిసిల్లలో భారీ బందోబస్తు!
Sircilla: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Sircilla: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సిరిసిల్లలో భారీ బందోబస్తు!
Sircilla: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను పోలీస్ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.
సభా ప్రాంగణం, హెలిప్యాడ్, సీఎం ప్రయాణించే మార్గాల్లో రూట్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
బందోబస్తు విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. విధుల్లో ఉన్న సిబ్బంది మధ్య సమన్వయం, సమర్థవంతమైన విధుల నిర్వహణపై పర్యవేక్షిస్తున్నారు.
సీఎం పర్యటన పూర్తయ్యే వరకు భద్రతా ఏర్పాట్లను నిరంతరం సమీక్షిస్తూ, క్షేత్రస్థాయి అధికారులతో జిల్లా ఎస్పీ సమన్వయం చేస్తున్నారు.




