Karimnagar: బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా తిరుపతి నాయక్!

Karimnagar: బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధిగా గుగులోతు తిరుపతి నాయక్ నియామకం.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 4 Oct 2026 5:56 PM IST
Karimnagar
X

Karimnagar: బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా తిరుపతి నాయక్!

కరీంనగర్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియామకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గుగులోతు తిరుపతి నాయక్ పార్టీ నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా తిరుపతి నాయక్ మాట్లాడుతూ... తన నియామకానికి ఎంతగానో సహకరించి, ఆశీస్సులు అందించిన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు సూచనల మేరకు, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన బిజెపి రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు నేనావత్ రవి నాయక్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.

గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా, గిరిజన తండాలు మరియు గూడేలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిత్యం ముందుండి పోరాటం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తానని చెప్పారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమిస్తూ, పార్టీ అప్పగించిన బాధ్యతలను సర్థకతతో నిర్వహిస్తానని తెలిపారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN