Sircilla: సిరిసిల్ల మానేరు వాగు వద్ద ఘనంగా సద్దుల బతుకమ్మ!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు వాగు వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబురాలు వైభవంగా జరిగాయి. కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.

KALEEM, SIRICILLA
Published on: 19 Oct 2026 7:58 AM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల మానేరు వాగు వద్ద ఘనంగా సద్దుల బతుకమ్మ!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు వాగు వద్ద సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో ఆదివారం సద్దుల బతుకమ్మ సంబురాలను వైభవంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ వేడుకలకు హాజరై మహిళలకు, ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, క్రాకర్స్ షో ప్రేక్షకులను అలరించాయి. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, డీవైఎస్‌వో రాందాస్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA