Sircilla: సిరిసిల్లలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. హాజరై నివాళులు అర్పించిన మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు ఇతర ప్రముఖులు.
Sircilla: సిరిసిల్లలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు!
Sircilla: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, అజ్మతుల్లా హుస్సేనీ మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని, ధైర్యసాహసాలను కొనియాడారు. సమాజం కోసం ఆమె చేసిన సేవలను స్మరించుకున్నారు. ప్రజల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.




