Karimnagar: శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు!
Karimnagar: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి.
Karimnagar: శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు!
Karimnagar: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముద్దేసాని రమేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధించే గొప్ప సంస్కృతి మనదని, పూలను గౌరవిస్తూ తెలంగాణ వ్యాప్తంగా చేసుకునే పండుగ బతుకమ్మ సంబరాలని, ఈ సంబరాలలో విద్యా విద్యార్థులందరూ ఉల్లాసంగా పాల్గొనడం బతుకమ్మ పాటలతో అలరించడం ఆనంద కరమన్నారు.
విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి, మన సంస్కృతికి అద్దం పట్టేలా దుస్తులు ధరించి బతుకమ్మను ఆడి పాడారు. ఇలాంటి ఉత్సవాలను ప్రజలందరూ కలిసి చేసుకునే సంబరాలను మన కళాశాలలో విద్యార్థులు అందరూ చేసుకోవడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ రామ నర్సింహారెడ్డి, డాక్టర్ ప్రసాద్ రాజు, హెచ్ఓడిలు డాక్టర్ ఎం రవీందర్, డాక్టర్ చంద్రమౌళి, మీడియా ఇంన్ఛార్జి గుంటి రమేష్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




