Peddapalli: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ చింతకుంట విజయ!

Peddapalli: కాల్వ శ్రీరాంపూర్ మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు. సన్న వడ్లకు క్వింటాల్‌కి రూ. 500 బోనస్‌తో కలిపి రూ. 2,961 చెల్లింపు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 29 Oct 2026 7:13 AM IST
Peddapalli
X

Peddapalli: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ చింతకుంట విజయ!

Peddapalli: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ప్రభుత్వ విప్ పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు విస్తృతంగా పర్యటించారు.

మండలంలోని కాల్వ శ్రీరాంపూర్, పెగడపల్లి, ఆశన్నపల్లి, మడిపల్లి, అంకంపల్లి, మడిపల్లి కాలనీ గ్రామాల్లో సింగిల్ విండో, ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్ పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు.

ముందుగా కొనుగోలు కేంద్రాలకు ప్రారంభానికి వచ్చిన ప్రభుత్వ విప్ కు ఆయా గ్రామ సర్పంచులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఐకేపీ, సింగిల్ విండో ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామన్నారు.

ఈ కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించే రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని హితవు పలికారు.సాధారణ రకం ధాన్యానికి మద్దతు ధరతో పాటు, సన్న వడ్లకు క్వింటాల్‌కి రూ. 500 బోనస్ కలుపుకొని మొత్తం క్వింటాల్‌కు రూ. 2,961 అందజేయడం జరుగుతుంది. రైతులు ధాన్యం విక్రయించిన 36 నుండి 48 గంటల్లోపే వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుందని స్పష్టం చేశారు.

​ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్య, సింగిల్ విండో సీఈఓ కొల్లేటి శ్రీనివాస్ ఆయాగ్రామల సర్పంచులు ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli