Vemulawada: వీరబ్రహ్మేంద్ర స్వామి ధ్వజస్తంభ ప్రతిష్టాపనలో విప్ ఆది శ్రీనివాస్!

Vemulawada: వేములవాడ పరిధిలోని నాంపల్లి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.

BABU, VEMULAWADA
Published on: 5 Nov 2026 11:55 AM IST
Vemulawada
X

Vemulawada: వీరబ్రహ్మేంద్ర స్వామి ధ్వజస్తంభ ప్రతిష్టాపనలో విప్ ఆది శ్రీనివాస్!

Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధిలోని నాంపల్లిలోనీ శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విప్ కు ఆలయ నిర్వాహకులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.

ఆలయాల్లో నిర్వహించే ఇటువంటి ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడంతో పాటు సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు అందించడంలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటాయని తెలిపారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA