Chandurthi: మూడపల్లిలో రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన: ఆది శ్రీనివాస్
Chandurthi: రాజన్న సిరిసిల్ల జిల్లా మూడపల్లిలో జరిగిన రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శనలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని ఎల్‌నినో, పంటల వైవిధ్యంపై మాట్లాడారు.
Chandurthi: మూడపల్లిలో రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన: ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల జిల్లా: చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణ రైతు విఙ్ఞాన కేంద్రం వేములవాడ, బాబు జగజ్జీవన్ రామ్ సిరిసిల్ల, ప్రొఫెసర్ జయశంకర్ పొలాస వారి ఆధ్వర్యంలో గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా రైతు సదస్సు మరియు వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమం..
ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
విద్యార్థులు ప్రదర్శించిన స్టాల్ల్స్ ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్న విప్...
కామెంట్స్
భూమితో అనుబంధం కలిగి వ్యవసాయ, వ్యవసాయ విద్యను అభ్యసిస్తూ రైతులకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్న విద్యార్థులకు ప్రత్యేక అభినందలు..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేశామని, వ్యవసాయాన్ని దండగ నుంచి పండుగగా మార్చాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ చేశాం..
సన్నరకం ధాన్యానికి ప్రోత్సాహం అందించడం, మార్కెట్లో మంచి ధర లభించేలా చర్యలు తీసుకోవడం ద్వారా రైతులకు ఆర్థిక ప్రయోజనం కల్పిస్తున్నాం.
ఎల్‌నినో కారణంగా ప్రపంచవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లోనే రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల్లో సమీక్షలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతులను అప్రమత్తం చేస్తున్నాం...
తెలంగాణలోని వివిధ ప్రాంతాల నేల స్వభావం, నేల సారాన్ని శాస్త్రీయంగా పరిశీలించి ఏ భూమిలో ఏ పంట సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుందో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
రైతులకు నేల సార పరీక్షలు అందుబాటులోకి తీసుకురావడం, పంటల ఎంపికలో శాస్త్రీయ అవగాహన కల్పించడం లక్ష్యంగా సాయిల్ టెస్టింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.
వ్యవసాయ విద్య, పరిశోధన, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రతి జిల్లాకు ఒక రైతు విద్యా కేంద్రం ఏర్పాటు చేయాలనే ఆలోచనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు..
వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు తమ భూమిలో కొంత భాగంలో ఆయిల్‌పామ్ వంటి వాణిజ్య పంటలను సాగు చేయాలని, పంటల వైవిధ్యంతో ఆదాయ అవకాశాలను పెంచుకోవాలి.
వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, నేల పరీక్షలు, పంటల మార్పిడి విధానాలపై రైతులకు నిరంతరం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
వ్యవసాయ విద్యను పూర్తి చేసుకొని అప్రెంటిస్‌షిప్ అనుభవంతో ఉద్యోగ అవకాశాల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు భవిష్యత్తులో రైతులకు సేవలందిస్తూ మంచి పేరు సంపాదించుకోవాలి.




