Thangallapalli: మండేపల్లి వృద్ధాశ్రమంలో ఆది శ్రీనివాస్ జన్మదిన సంబరాలు

Thangallapalli: తంగళ్లపల్లి మండేపల్లి వృద్ధాశ్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Published on: 18 Sept 2026 6:24 PM IST
Thangallapalli
X

Thangallapalli: మండేపల్లి వృద్ధాశ్రమంలో ఆది శ్రీనివాస్ జన్మదిన సంబరాలు

తంగ్గళ్ళపల్లి: మండలం మండేపల్లి ప్రభుత్వ వయోవృద్ధుల ఆశ్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఇందిరమ్మ కాలనీ సర్పంచ్ గడ్డం రచన చోటు ఆధ్వర్యంలో వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపారు.

అనంతరం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడి జన్మదిన వేడుకలను కేవలం హంగూ ఆర్భాటాలకు పరిమితం చేయకుండా, వృద్ధుల మధ్య సేవా కార్యక్రమాలతో నిర్వహించడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఆది శ్రీనివాస్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మునిగిల రాజు, SIR కార్యక్రమ జిల్లా కో-ఆర్డినేటర్ జలగం ప్రవీణ్, పసుల వెంకన్న, బండి పరశురాములు, ఎగుర్ల ప్రశాంత్, గుగ్గిళ్ల భరత్, ఎడ్ల తిరుపతి, గట్టు లింగారెడ్డితో పాటు ఇందిరమ్మ కాలనీ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంపెల్లి శ్యామ్, గ్రామ ఉప సర్పంచ్ కొండ శ్రీకాంత్, వార్డు సభ్యులు ఒడ్డెపెల్లి రమ, మందాటి శారద, కొండ భరత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బల్ల లక్ష్మీపతి, మాటేటి రాజు, భోగ రంగయ్య, గాలి వీరేశం, బండారి కిషన్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA