Chandurthi: మర్రిగడ్డ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత షూస్ పంపిణీ!
Chandurthi: మరిగడ్డ ఎస్సీ పాఠశాలలో ఉచిత బూట్ల పంపిణీ జరిగింది. ప్రైవేట్‌కు దీటుగా సర్కారు బడులు రాణిస్తున్నాయని సర్పంచ్ దూది మనీషా తెలిపారు.
Chandurthi: మర్రిగడ్డ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత షూస్ పంపిణీ!
Chandurthi: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు విశేషంగా రాణిస్తున్నాయని అందుకు ఉపాధ్యాయుల నాణ్యమైన బోధనతోపాటు ప్రభుత్వ సహకారం ముఖ్యమని గ్రామ సర్పంచ్ దూది మనీషా శ్రీనివాస్ రెడ్డి గారు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా సరఫరా చేసిన షూస్ ( బూట్లు) ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ నాయిని జయతో కలిసి విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వేముల భార్గవి, ఉపాధ్యాయులు రామస్వామి, సాగరిక వార్డు సభ్యులు రాజేశ్వరి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.




