Karimnagar: కరీంనగర్‌లో ట్రైనీ డాక్టర్ల నిరసన సమాన పనికి సమాన స్టైపెండ్ ఇవ్వాలని డిమాండ్!

Karimnagar: కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎఫ్ఎమ్‌జీ (FMG) ఇంటర్న్లు విధులను బహిష్కరించారు. ఐఎమ్‌జీలతో సమానంగా పనిచేస్తున్నా తక్కువ స్టైపెండ్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 10 Oct 2026 12:38 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో ట్రైనీ డాక్టర్ల నిరసన సమాన పనికి సమాన స్టైపెండ్ ఇవ్వాలని డిమాండ్!

Karimnagar: తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న Foreign Medical Graduates (FMGs) అతి తక్కువ స్టైపెండ్‌ చెల్లింపునకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు.MBBS పూర్తి చేసి, FMGE ఉత్తీర్ణత సాధించి, అన్ని అవసరమైన అర్హతలను పూర్తి చేసి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో Compulsory Rotatory Internship (CRI)లో పనిచేస్తున్న వైద్యులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో Indian Medical Graduates (IMGs)తో సమానంగా విధులు నిర్వహిస్తూ, అదే రోగులకు వైద్య సేవలు అందిస్తూ, అదే పని భారం మరియు బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పటికీ, FMGsకు ప్రస్తుతం నెలకు సుమారు ₹5,000 మాత్రమే స్టైపెండ్ చెల్లిస్తోందన్నారు. అదే సమయంలో IMGsకు సుమారు ₹29,972 స్టైపెండ్ ప్రభుత్వం చెల్లిస్తుంది.

ఒకే ఆసుపత్రిలో, ఒకే విభాగాల్లో, ఒకే విధమైన విధులు మరియు బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు, స్టైపెండ్‌లో ఇంత పెద్ద వ్యత్యాసం ఎందుకు ఉండాలి అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తెలంగాణలోని పలు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో FMG ఇంటర్న్స్ తమ తమ కళాశాల స్థాయిలో నిరసన కార్యక్రమాలను ప్రారంభించారు అని అన్నారు. అయితే, వారి సమస్య ప్రభుత్వం మరియు ప్రజల దృష్టికి మరింత బలంగా తీసుకెళ్లేందుకు అక్టోబర్ 14న తెలంగాణ వ్యాప్తంగా FMG ఇంటర్న్స్ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు..

వారు ప్రభుత్వాన్ని మరియు సంబంధిత అధికారులను డిమాండ్ చేసేది ఒక్కటే — FMG మరియు IMG ఇంటర్న్స్ మధ్య ఉన్న స్టైపెండ్ వ్యత్యాసాన్ని తొలగించి, సమానంగా స్టైపెండ్ అందించాలన్నారు.. తాము వైద్య సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నామని.కానీ వారి సేవలకు తగిన న్యాయం మరియు సమానత్వం కూడా కావాలన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్