Peddapalli: గోదావరిఖనిలో ఘనంగా పీటీ స్వామి సంస్మరణ సభ!

Peddapalli: గోదావరిఖనిలో పీటీ స్వామి సంస్మరణ సభ. మరణానంతరం నేత్రదానం చేసిన పీటీ స్వామి. హాజరై నివాళులర్పించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, కోరుకంటి చందర్.

VIJAY, RAMAGUNDAM
Published on: 6 Nov 2026 7:08 AM IST
Peddapalli
X

Peddapalli: గోదావరిఖనిలో ఘనంగా పీటీ స్వామి సంస్మరణ సభ!

Peddapalli: విద్య, సామాజిక సేవతోపాటు రాజకీయ, కార్మిక రంగాల్లో పీటీ స్వామి అందించిన సేవలు చిరస్మరణీయమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సమాజ హితం కోసం జీవితాంతం కృషి చేసిన ఆయన మరణానంతరం కూడా తన నేత్రాలను దానం చేసి మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. పీటీ స్వామి ఇటీవల మృతి చెందగా, విషాదంలోనూ ఆయన నేత్రాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని దుర్గానగర్‌ ఆర్‌కే గార్డెన్స్‌లో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి పీటీ స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం పీటీ స్వామి కుమారుడు పీ.ఎస్.అమరేందర్ తోపాటు కుటుంబ సభ్యులకు సదాశయ ఫౌండేషన్ తరఫున అందజేసిన అభినందన పత్రాన్ని కొప్పుల ఈశ్వర్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బతికున్నంత కాలం ప్రజల కోసం, సమాజ అభ్యున్నతి కోసం పరితపించిన పీటీ స్వామి.. మరణం తర్వాత కూడా తన నేత్రదానంతో ఇద్దరికి చూపునిచ్చి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. తండ్రి చివరి కోరికకు అనుగుణంగా నేత్రదానానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యులను కొప్పుల ఈశ్వర్, కోరుకంటి చందర్ అభినందించారు.

ఆలోచింపజేసిన నేత్రదానంపై అవగాహన. సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి సీహెచ్ లింమూర్తి నేత్ర, అవయవ, శరీరదానాల ప్రాముఖ్యతను వివరించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు ఆరెపల్లి రాజమౌళి, కేఎస్ వాసు, నూతి సురేష్ కుమార్, జీవన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

VIJAY, RAMAGUNDAM

VIJAY, RAMAGUNDAM