Manthani: గోదావరి అర్బన్ మంథని బ్రాంచ్‌ను సందర్శించిన ఎండీ తాంబేకర్!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి అర్బన్ బ్యాంక్ శాఖను ఎండీ ధనుంజయ్ తాంబేకర్ సందర్శించి ఖాతాదారులు, ఉద్యోగులతో బ్యాంకు సేవలపై సమావేశమయ్యారు.

SHANKAR, MANTHANI
Published on: 23 Nov 2026 6:15 PM IST
Manthani
X

Manthani: గోదావరి అర్బన్ మంథని బ్రాంచ్‌ను సందర్శించిన ఎండీ తాంబేకర్!

Manthani: గోదావరి అర్బన్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ పెద్దపల్లి జిల్లా మంథని శాఖను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ధనుంజయ్ తాంబేకర్ సందర్శించారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులతో పాటు ఖాతాదారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై బ్యాంకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలు, వివిధ పథకాల గురించి వివరంగా చర్చించారు.

దేశంలోని ఆరు రాష్ట్రాల్లో 100కు పైగా శాఖలతో విస్తరించి ఖాతాదారులకు నాణ్యమైన, వేగవంతమైన బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నామని ఎండీ తెలిపారు. ఖాతాదారుల సంతృప్తే బ్యాంకు ప్రధాన లక్ష్యమని, ప్రతి ఖాతాదారుడికి మెరుగైన సేవలు అందిస్తూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఉద్యోగులకు సూచించారు.

ఈ సందర్భంగా ఖాతాదారులతో నేరుగా మాట్లాడి బ్యాంకు సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. బ్యాంకు ద్వారా అందిస్తున్న పొదుపు పథకాలు, డిపాజిట్లు, రుణ సదుపాయాలు, ఇతర సౌకర్యాల గురించి వివరించారు.

ఈ సందర్భంగా మంథని పట్టణ విశిష్టత, చారిత్రక ప్రాధాన్యత, ఘనమైన చరిత్ర గురించి మంథని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిబాబు వివరించారు. మంథని ప్రాంతానికి ఉన్న చారిత్రక గొప్పతనాన్ని తెలియజేశారు.

ఖాతాదారుల విశ్వాసం, ఉద్యోగుల కృషితో గోదావరి అర్బన్ బ్యాంక్ మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఎండీ ధనుంజయ్ తాంబేకర్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో హెడ్ ఆఫీస్ రికవరీ ఆఫీసర్ పాముల విజయ్, లీగల్ ఆఫీసర్ ఓం ప్రకాష్ చించోకర్, మంథని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిబాబు, ఖాతాదారులు కొత్త శ్రీనివాస్, సిరిపురం సురేష్, రావుల సతీష్, బ్రాంచ్ మేనేజర్ నాగుల రమేష్, కొరవేన రమేష్, లక్కాకుల శంకర్, గణేష్, శిరీష, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI