Sircilla: గంభీరావుపేటలో అక్రమ గోవా మద్యం స్వాధీనం - ఒకరి అరెస్టు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన గోవా మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకుని, ఒకరిని అరెస్టు చేశారు.

ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ విజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక తనిఖీల్లో భాగంగా సోమవారం లక్ష్మీపూర్, గోరింటాల, లింగన్నపేట, సముద్ర లింగాపూర్, గజసింగవరం గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. గోరింటాల గ్రామానికి చెందిన కుమ్మరవేరి నాగరాజు వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా నిల్వ ఉంచిన 750 ఎంఎల్ సామర్థ్యం గల 15 గోవా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్) సీసాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సీఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ మొహిస్, కానిస్టేబుళ్లు సిద్ధి రాములు, కరుణాకర్, కృషిధర్, వర్ష తదితరులు పాల్గొన్నారు.