Peddapalli: జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో గాయత్రి విద్యానికేతన్ విద్యార్థుల ప్రతిభ!
Peddapalli: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల రంగోలి పోటీల్లో శుక్రవారం పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించారు.
Peddapalli: జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో గాయత్రి విద్యానికేతన్ విద్యార్థుల ప్రతిభ!
Peddapalli: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన పాటలు, రంగోలి, మెహెందీ పోటీలలో పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్ చిన్నారులు ప్రతిభ కనబరిచి బహుమతులు గెలుపొందారు.
రంగోలి పోటీలలో 8వ తరగతి విద్యార్థినులు కె. సోహల్య, కె. నందినీ పటేల్ ప్రథమ బహుమతి గెలుపొందారు. పాటల పోటీలలో 8వ తరగతి విద్యార్థి దివిజ రెండవ బహుమతి, 10వ తరగతి విద్యార్థినులు ఎస్. సింధు, ఎ. అమృత కన్సోలేషన్ బహుమతి గెలుపొందారు.
మెహెందీ పోటీలలో 9వ తరగతి విద్యార్థినులు ఈశాన్వి, జె. షైత్రిక కన్సోలేషన్ బహుమతి గెలుపొందారు. విజేతలకు పెద్దపల్లి జిల్లా గ్రంథాలయాల చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ బహుమతులు ప్రదానం చేశారు. బహుమతులు గెలుపొందిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్, కరెస్పాండెంట్ రజనీదేవి, ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం అభినందించారు.




