Sircilla: గ్రంథాలయం వెనుక గేట్ వద్ద చెత్త కుప్పలు.. అధికారుల నిర్లక్ష్యం!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం వెనుక గేట్ వద్ద చెత్త కుప్పలు పేరుకుపోయి అపరిశుభ్రత నెలకొంది. మున్సిపల్ అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
Sircilla: గ్రంథాలయం వెనుక గేట్ వద్ద చెత్త కుప్పలు.. అధికారుల నిర్లక్ష్యం!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయం వెనుక గేట్ ముందు అపరిశుభ్రత నెలకొంది. నిత్యం చదువుకోవడానికి వచ్చే విద్యార్థులు, పాఠకులతో కళకళలాడే గ్రంథాలయం పరిసరాల్లో చెత్తాచెదారం, మిగిలిపోయిన ఆహార పదార్థాలు, ఉపయోగించిన ప్లేట్లు పేరుకుపోయి కనిపిస్తున్నాయి.
పట్టణ నడిబొడ్డున, నిత్యం విద్యార్థులు, పాఠకులు రాకపోకలు సాగించే ప్రాంతంలోనే ఈ పరిస్థితి నెలకొనడం పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. గ్రంథాలయం వెనుక గేట్ ముందు చెత్త పేరుకుపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. ప్రధాన ప్రాంతంలోనే పారిశుద్ధ్య పరిస్థితి ఇలా ఉంటే పట్టణంలోని అంతర్గత ప్రాంతాల పరిస్థితి ఎలా ఉందోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విద్యార్థులు, పాఠకులు నిత్యం ఉపయోగించే గ్రంథాలయ పరిసరాల్లో ఇలాంటి పరిస్థితి ఉండటం గమనార్హం. సంబంధిత మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే చెత్తను తొలగించడంతో పాటు, ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. గ్రంథాలయం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంపై అధికారులు దృష్టి సారించాలి.




