Srirampur: విద్యార్థుల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకం: సర్పంచ్, ఎంఈవో!
Srirampur: కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం జెడ్పీహెచ్ఎస్‌లో పీటీఎం సమావేశం. జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ వాలీబాల్ పోటీలకు ఎంపికైన నలుగురు విద్యార్థులకు ఘన సన్మానం.
Srirampur: విద్యార్థుల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకం: సర్పంచ్, ఎంఈవో!
శ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విక్రమ్ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ రేకుల జ్యోతి రఘు మండల విద్యాధికారి మహేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
సెప్టెంబర్ 18న ZPHS అప్పన్నపేటలో నిర్వహించిన SGF జోనల్ స్థాయి వాలీబాల్ పోటీల్లో గంగారం పాఠశాల నలుగురు విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక కాగా ఎంపికైన విద్యార్థులను వారి తల్లిదండ్రులను సర్పంచ్ రేపుల జ్యోతి తో పాటు మండల విద్యాధికారి మహేష్ ప్రధానోపాధ్యాయులు విక్రంలు శాలువాతో సన్మానించారు.విద్యార్థులు జిల్లా స్థాయిలోనూ రాణించి గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల హాజరు, క్రమశిక్షణ, అభ్యసన ప్రగతిపై తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని, ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించడం ఎంతో అభినందనీయం.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు క్రీడల పట్ల ఉన్న ఆసక్తి, క్రమశిక్షణే వారిని ఈ స్థాయిలో నిలబెట్టింది. జిల్లా స్థాయి పోటీలలో కూడా ఇదే రకమైన ప్రతిభను, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించి విజయాలు సాధించాలి. తద్వారా మన ZPHS గంగారం పాఠశాలకు, గంగారం గ్రామానికి మరియు పెద్దపల్లి జిల్లాకు మరింత మంచి పేరు తీసుకురావాలి" అని ఆకాంక్షించారు.




