Kalva Srirampur: గంగారంలో కోతుల బీభత్సం ధ్వంసమైన వరి నారు మళ్లు, రైతుల ఆవేదన
Kalva Srirampur: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారంలో వరి నారు మళ్లపై దాడి చేసిన కోతుల గుంపు. తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల విజ్ఞప్తి.
Kalva Srirampur: గంగారంలో కోతుల బీభత్సం ధ్వంసమైన వరి నారు మళ్లు, రైతుల ఆవేదన
కాల్వ శ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామ శివారులో కోతుల గుంపు బీభత్సం సృష్టించింది. యాసంగి పంట సాగు కోసం రైతులు ఎంతో కష్టపడి, పెట్టుబడి పెట్టి పోసుకున్న వరి నారు మళ్లపై శనివారం కోతుల దండు ఒక్కసారిగా దాడి చేసింది. నారును పీకి పడేస్తూ, తొక్కుతూ తీవ్రంగా ధ్వంసం చేశాయి.
వరి నారు మళ్లు పూర్తిగా కరాబ్ కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నారు మళ్లీ పోసుకోవాలంటే సమయం మించిపోతుందని, పెట్టుబడి నష్టపోయామని కన్నీటి పర్యంతమవుతున్నారు. మండల అధికారులు స్పందించి కోతుల బెడద నుంచి తమ పంటలను కాపాడాలని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని గంగారం గ్రామ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.




