Karimnagar: కరీంనగర్‌లో అత్యంత వైభవంగా ప్రారంభమైన గణేష్ నిమజ్జనోత్సవాలు!

Karimnagar: కరీంనగర్ నగరంలో వైభవంగా ప్రారంభమైన గణేష్ నిమజ్జనోత్సవాలు. కొత్తపల్లి నిమజ్జన పాయింట్‌ను ప్రారంభించి తొలి విగ్రహానికి పూజలు చేసిన మేయర్ కొలగాని శ్రీనివాస్.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 23 Sept 2026 2:03 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో అత్యంత వైభవంగా ప్రారంభమైన గణేష్ నిమజ్జనోత్సవాలు!

Karimnagar: కరీంనగర్ నగరంలో గత తొమ్మిది రోజులుగా భక్తుల పూజలు, భజనలు, విశేష అభిషేకాలందుకున్న లంబోదరుడు గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమయ్యాయి.

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొత్తపల్లి వద్ద ఏర్పాటు చేసిన నూతన నిమజ్జనం పాయింట్ వద్ద విగ్రహాల నిమజ్జన ప్రక్రియ శోభాయమానంగా మొదలైంది. ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. కొత్తపల్లి పాయింట్‌కు తరలివచ్చిన మొట్ట మొదటి వినాయక విగ్రహానికి మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేసి క్రేన్ సహాయంతో విగ్రహాన్ని నిమజ్జనం చేసి, విగ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటుగా సిబ్బంది, కార్పొరేటర్లు, ప్రజలు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN