Yellareddypeta: ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు!

Yellareddypeta: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించారు.

KALEEM, SIRICILLA
Published on: 2 Oct 2026 12:54 PM IST
Yellareddypeta
X

Yellareddypeta: ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు!

Yellareddypeta: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని భారత రాష్ట్ర సమితి పార్టీ, జెడ్పీటీసీ కార్యాలయంలో గాంధీజీ జయంతి వేడుకలను నిర్వహించారు.

బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వరస కృష్ణహరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ త్యాగాలు, అహింసా మార్గం, పోరాట స్ఫూర్తిని నాయకులు స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా గాంధీజీ ఆశయాలను గుర్తుచేసుకుంటూ ఆయన చూపిన అహింసా మార్గాన్ని స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ చేసిన సేవలు, త్యాగాలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మీసం రాజన్న, ఆకుల మురళీమోహన్ గౌడ్, ఎడ్ల సందీప్, పరుశురాం గౌడ్, నేవూరి వెంకటనరసింహారెడ్డి, గుండాడి వెంకటరెడ్డి, లింగాల సందీప్, హసన్ బాయ్, తోట రాజేందర్ తదితరులు పాల్గొని మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA