Peddapalli: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు!

Peddapalli: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో గాంధీ జయంతి వేడుకలను ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఘనంగా నిర్వహించి, మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 2 Oct 2026 12:28 PM IST
Peddapalli
X

Peddapalli: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు!

Peddapalli: పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని గాంధీనగర్‌లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

​అనంతరం ప్రజలకు, నాయకులకు గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ వహించిన పాత్ర చిరస్మరణీయమని, ఆయన బోధించిన సిద్ధాంతాలు ప్రపంచానికే దిశానిర్దేశం చేశాయని కొనియాడారు. సమాజంలో శాంతి, సమరసత నెలకొనాలంటే ప్రతి ఒక్కరూ గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. గాంధీజీ కన్న కలల ప్రకారం పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మరియు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు వ్యవసాయ మార్కెట్ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్లు మరియు మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli