Thangallapally: తంగ్గళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి!
Thangallapally: తంగ్గళ్ళపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Thangallapally: తంగ్గళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి!
Thangallapally: తంగ్గళ్ళపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మునిగేల రాజు ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. అహింస, సత్యాగ్రహం, శాంతి మార్గంలో గాంధీజీ చూపిన బాటను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




