Siricilla: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు!
Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ నివాళులర్పించారు.
Siricilla: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు!
Siricilla: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కౌన్సిలర్లు లింగంపల్లి గంగరాజు, కూరపాటి శ్రీశైలం, బొద్దుల శ్రీనివాస్, ఎస్సీ సెల్ నాయకులు ఆకునూరి బాలరాజు, మహిళా నాయకురాలు అరుణ, పట్టణ అధ్యక్షులు సూర దేవరాజు, మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రియాజ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్‌పర్సన్ వెలుముల స్వరూప, మాజీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు రఫీక్, ఎస్సీ పట్టణ అధ్యక్షుడు నక్క నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.




