Jammikunta: జమ్మికుంటలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు.
Jammikunta: జమ్మికుంటలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో గాంధీ జయంతి పురస్కరించుకొని బ్రహ్మకుమారీస్ (ఓం శాంతి) వారు ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ బ్రహ్మకుమారీస్ సంస్థ నుండి ఆథ్యాత్మికతతో పాటు,యోగా సమాజంలో మన ప్రవర్తన,మనకు ఉండవలసిన అలవాట్లు పుట్టిన తర్వాత మరణించే వరకు ఈ ప్రయాణంలో మనం ఉండవలసిన పద్ధతులన్నీ కూడా ఇక్కడ మనకి చెప్పడంమనిషి.పుట్టడం,మరణించడం అది సృష్టి ధర్మం కానీ ఈ మధ్యలో ఉండే కాలంలో మనం ఉండవలసినటువంటి తీరు,మనపైన ఆధారపడుతున్న కుటుంబ సభ్యులు,మనపైన ఆధారపడుతున్నటువంటి సమాజం ఆ సమాజంలో మనం ఉండవలసిన బాధ్యత,ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ జన్మించిన మనం కాలం చేసే వరకి ఉన్న జీవితాన్నిచాలాసంతోషంగా,ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం తినడానికి తిండి,ఉండడానికి ఒక ఇల్లు,ఏవైతే మౌలిక వసతులు అందరికీ ఉండే విధంగా మనయొక్క నిర్మాణం ఉండాలని చెప్పి వారు చెప్పడం జరిగింది.
అలాగే ఈ ప్రతిజ్ఞ చేయడం జరిగింది మత్తు పదార్థాలకు గాని,చెడు అలవాట్లకు గాని పోవద్దని, దయచేసి అందరూ కూడా మన ఆర్థిక పరిస్థితులు, మన ఆరోగ్యం పట్ల, కుటుంబాల పట్ల శ్రద్ధ వహించి అందరూ కూడా ఈ ప్రతిజ్ఞను కూడా పాటించాలని తెలియజేస్తూ అలాగే పట్టణమంతా పరిశుభ్రంగా ఉండడానికి కారణమైనటువంటి మున్సిపల్ కార్మికులను గుర్తించి వారికి తోచిన సహాయాన్ని అందించిన బ్రహ్మకుమారీస్ కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఓం శాంతి తెలియజేస్తూ మీరు ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో అవేర్‌నెస్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని,ఆ భగవంతుడు మీకు మంచి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు,అన్నీ సమృద్ధిగా 10 మందికి సేవ చేసుకునే కార్యక్రమాన్ని మీకు ఆ భగవంతుడు ప్రోత్సాహాన్ని, దీవెనలు ఇవ్వాలని తెలుపుతూ అందరికీ కూడా ఓం శాంతి
మనము ఓం శాంతి చెప్పేటప్పుడు కూడా చాలా నిమ్మదిగా ఓం శాంతి ఎందుకంటే వీళ్ళ ముఖ్య ఉద్దేశమే కోపానికి, సమాజంలో ఎవరూ వ్యతిరేకించే విధంగా ఉండొద్దని చెప్పి, చాలా నిమ్మదిగా ఓపికగా ఉండేటటువంటి కార్యక్రమం గనుక, అందరూ కూడా ఇంత విలువైన సమయాన్ని ప్రత్యేక కృతజ్ఞతలు ఓం శాంతి తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు.




