Gambhiraopet: గంభీరావుపేటలో ఎంఎస్‌ఎఫ్ జాతీయ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ
Gambhiraopet: హైదరాబాద్ యూనివర్సిటీలో జరగనున్న ఎంఎస్‌ఎఫ్ జాతీయ సదస్సు పోస్టర్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఎమ్మార్పీఎస్ నేతలు ఆవిష్కరించారు.
Gambhiraopet: గంభీరావుపేటలో ఎంఎస్‌ఎఫ్ జాతీయ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ
Gambhiraopet: గంభీరావుపేట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎంఎస్‌ఎఫ్ (మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్) జాతీయ సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు తుడుం ప్రశాంత్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు పోస్టర్‌ను ఆవిష్కరించారు.
గౌరవ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు హైదరాబాద్ యూనివర్సిటీలో నిర్వహించనున్న ఎంఎస్‌ఎఫ్ జాతీయ సదస్సుకు గంభీరావుపేట మండలంలోని విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తుడుం ప్రశాంత్ మాదిగ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ఇన్‌చార్జ్ బరుకుటం తిరుపతి మాదిగ, ఎంఎస్‌పీ గుండెల్ని బాలరాజ్ మాదిగ, మండల కార్యదర్శి రాగాపురం వెంకటేష్, గంభీరావుపేట టౌన్ అధ్యక్షుడు తిరుపతి, సీనియర్ నాయకులు పరశురాములు మాదిగ, దమ్మన్నపేట అధ్యక్షుడు స్వామి మాదిగతో పాటు లక్ష్మణ్ మాదిగ, మహేందర్ మాదిగ, బాలరాజు మాదిగ, నరేష్ మాదిగ, సంజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.




