Sircilla: 45 మంది వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేసిన ఫ్రెండ్స్ క్లబ్!
Sircilla: తంగళ్లపల్లి మండలం మండేపల్లి వృద్ధాశ్రమంలో ఫ్రెండ్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 45 మంది వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.
Sircilla: 45 మంది వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేసిన ఫ్రెండ్స్ క్లబ్!
Sircilla: చలికాలంలో వృద్ధులకు అండగా నిలిచి, వారికి ఆత్మీయతను పంచేందుకు ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులు ముందుకొచ్చారు. తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ పరిధిలోని మండేపల్లి గ్రామంలో ఉన్న వయోవృద్ధుల ఆశ్రమంలో స్థానిక ఫ్రెండ్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు.
సంస్థ అధ్యక్షుడు ఎడమల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో, తంగళ్లపల్లి గ్రామానికి చెందిన టెక్స్టైల్ రంగ ప్రముఖులు సామలేటి రాజు సౌజన్యంతో ఆయన తండ్రి సామలేటి భూమలింగం జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆశ్రమంలో నివసిస్తున్న సుమారు 45 మంది వృద్ధులకు చలికాలంలో ఉపయోగపడేలా ఉలెన్ దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వృద్ధులకు అవసరమైన సహాయాన్ని అందించడంతో పాటు వారితో ఆత్మీయంగా గడిపి మనోధైర్యాన్ని కల్పించారు. మానవ సేవయే మాధవ సేవ అనే లక్ష్యంతో ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవుతూ వృద్ధులకు అండగా నిలవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొని వృద్ధులకు దుప్పట్లు, పండ్లు అందజేశారు.




