Sircilla: సిరిసిల్ల టాస్క్‌లో ఉచిత నైపుణ్య శిక్షణ: కలెక్టర్ గరిమ

Sircilla: రాజన్న సిరిసిల్ల టాస్క్ కేంద్రంలో డిగ్రీ అభ్యర్థులకు టెక్నికల్, BFSI విభాగాల్లో ఉచిత నైపుణ్య శిక్షణ ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్నట్లు కలెక్టర్ తెలిపారు.

KALEEM, SIRICILLA
Published on: 24 Oct 2026 7:24 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల టాస్క్‌లో ఉచిత నైపుణ్య శిక్షణ: కలెక్టర్ గరిమ

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ప్రాంతీయ కేంద్రంలో టెక్నికల్ కోర్సులు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ (BFSI) విభాగాల్లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని పేర్కొన్నారు.

సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ కార్యాలయంలోని టాస్క్ ప్రాంతీయ కేంద్రంలో ఈ నెల 27వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

టాస్క్‌లో శిక్షణ పొందిన అభ్యర్థులకు మంచి ప్యాకేజీలతో ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. నిరుద్యోగ యువత ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 95734 20718, 70755 22671 నంబర్లలో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA