Peddapalli: సింగరేణిని నిర్వీర్యం చేస్తే కాంగ్రెస్‌కు పతనం తప్పదు: బాల్క సుమన్!
Peddapalli: సింగరేణిని నిర్వీర్యం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనం తప్పదని మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హెచ్చరించారు.
Peddapalli: సింగరేణిని నిర్వీర్యం చేస్తే కాంగ్రెస్‌కు పతనం తప్పదు: బాల్క సుమన్!
పెద్దపల్లి: సింగరేణిని నిర్వీర్యం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనం తప్పదని మాజీ ప్రభుత్వ విప్, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ హెచ్చరించారు. పెద్దపల్లి బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ హయాంలో 20 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించామని, కార్మికుల లాభాల వాటాను 16 నుంచి 32 శాతానికి పెంచామని, 30 వేల కుటుంబాలకు ఇంటి పట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో కార్మిక సంక్షేమం నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు.
సింగరేణిలో రూ.10 వేల కోట్లకు పైగా అవినీతి జరిగిందని, 40 లక్షల టన్నుల బొగ్గు లెక్కల్లో అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. 72 మిలియన్ టన్నుల నుంచి బొగ్గు ఉత్పత్తి 58 మిలియన్ టన్నులకు పడిపోయిందని, ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తోందని విమర్శించారు.
అక్టోబర్ 14న గోదావరిఖనిలో కేటీఆర్ పాల్గొనే సింగరేణి కార్మిక గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతా రెడ్డి, మాజీ టీఎస్పీఎస్సీ చైర్మన్ చిరుమల్ల రాకేష్, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఠాకూర్ రఘువీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.




