Karimnagar: కేసీఆర్‌కు ఇక రిటైర్మెంటేనా?: సుడా మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి
Karimnagar: సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి సభ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలైందని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు.
Karimnagar: కేసీఆర్‌కు ఇక రిటైర్మెంటేనా?: సుడా మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి
కరీంనగర్: సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ భారీ సక్సెస్ కావడంతో బిఆర్ఎస్ నాయకులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.
స్థానిక ముఖరంపురలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రాబోయే రోజుల్లో సిరిసిల్లను కాంగ్రెస్ గెలుచుకోవడం ఖాయం ఇక్కడి నుండి మంత్రి పదవి ఇస్తామని ప్రకటిస్తే బిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారని మొత్తం మీద భవిష్యత్తులో బిఆర్ఎస్ గెలిచే అవకాశం లేకున్నా ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నాయకులంతా కలిసి కేసీఆర్ ఇక రటైర్మెంటే అని చెప్పకనే చెప్పారని నరేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
కేసీఆర్ అందుకే ఫాంహౌస్ లో నుండి బయటకు రావడం లేదని అన్నారు.ఒకవైపు బీఆర్ఎస్ నాయకుల భూదోపిడి పై విచారణ జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల మీటింగులో ఆధారాలు చూపించలేదని బిఆర్ఎస్ నాయకులు బాద పడుతున్నారని అన్నీ ఆధారాలు ప్రజల ముందు ఉంచుతారని ముందున్నది మొసళ్ల పండుగ బిఆర్ఎస్ నాయకులకు ఎందుకంత తొందర అని నరేందర్ రెడ్డి మండిపడ్డారు.
ఈ విలేఖరుల సమావేశంలో జీడి రమేష్,ఎండి చాంద్,ముక్క భాస్కర్,మహమ్మద్ భారీ,కుర్ర పోచయ్య,షబానా మహమ్మద్,అస్తపురం రమేష్,బషీర్,సాయిరాం, మాసుం ఖాన్,హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.




