Mustabad: మణిదీప్ అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోసిన జోగినిపల్లి సంతోష్ కుమార్!
Mustabad: ముస్తాబాద్ మండలం బండనకల్ గ్రామానికి చెందిన మణిదీప్ కుమార్ అంత్యక్రియల్లో మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొని పాడె మోశారు.
Mustabad: మణిదీప్ అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోసిన జోగినిపల్లి సంతోష్ కుమార్!
రాజన్న సిరిసిల్ల జిల్లా: ముస్తాబాద్ మండలం బండనకల్ గ్రామానికి చెందిన మణిదీప్ కుమార్ అంత్యక్రియల్లో మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో అటెండర్‌గా పనిచేస్తున్న మణిదీప్ కుమార్ బందనకల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
మణిదీప్ మృతి వార్త తెలుసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించి, కుటుంబానికి అండగా నిలవాలని, అంత్యక్రియల ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవాలని సంతోష్ కుమార్‌ను ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బండనకల్ చేరుకున్న సంతోష్ కుమార్ మణిదీప్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అంత్యక్రియల్లో పాడె మోసి మణిదీప్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
మణిదీప్ కుటుంబాన్ని కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకుంటారని సంతోష్ కుమార్ హామీ ఇచ్చారు. మణిదీప్ చెల్లెలి చదువుతో పాటు వివాహ బాధ్యతలను కూడా కేసీఆర్ తీసుకుంటారని తెలిపారు. అదేవిధంగా మణిదీప్ తండ్రి, నానమ్మ ఆరోగ్య బాగోగులను చూసుకుంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ ఎంపీపీ జనగామ శరత్ రావు, కేసీఆర్ వ్యక్తిగత సిబ్బంది పాల్గొన్నారు.




