Sircilla: పరిశ్రమల అనుమతుల్లో నిబంధనలు పాటించాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్

Sircilla: రాజన్న సిరిసిల్లలో పరిశ్రమల ఏర్పాటుకు నిబంధనల ప్రకారం అనుమతులు ఇవ్వాలని డీఐపీసీ సమావేశంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 18 Sept 2026 5:56 PM IST
Sircilla
X

Sircilla: పరిశ్రమల అనుమతుల్లో నిబంధనలు పాటించాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు నిబంధనలకు అనుగుణంగా అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ (డీఐపీసీ) సమావేశం నిర్వహించారు. పరిశ్రమల శాఖతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

టీజీ ఐపాస్, టీ-ప్రైడ్ కింద ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని అనుమతుల కోసం పెండింగ్‌లో ఉన్నాయి, ఏయే కారణాలతో దరఖాస్తులు నిలిచిపోయాయనే వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. టీజీ ఐపాస్ కింద 44, టీ-ప్రైడ్ కింద 83 దరఖాస్తులకు అనుమతులు జారీ చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిబంధనలకు అనుగుణంగా అనుమతులు జారీ చేయాలని సూచించారు.

సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి హనుమంతు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజీవ్ కుమార్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ బీఎం అనిల్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సంగీత, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ స్వప్న, కమర్షియల్ ట్యాక్స్ అధికారి కిరణ్, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, ఎన్‌పీడీసీఎల్, టీజీఐఐసీ, పీసీబీ అధికారులు శ్రీనివాస్, విక్రమ్, కనకజ్యోతి, డీటీసీ పీఓ అన్సార్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA