Karimnagar: కరీంనగర్ ఆర్టీసీ జేబీఎం బస్సులో చెలరేగిన పొగలు!

Karimnagar: కరీంనగర్ ఆర్టీసీ 2 డిపోకు చెందిన జేబీఎం బస్సులో అగ్ని ప్రమాదం.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం, ఆందోళనలో ప్రయాణికులు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 18 Sept 2026 12:29 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ ఆర్టీసీ జేబీఎం బస్సులో చెలరేగిన పొగలు!

Karimnagar: కరీంనగర్ ఆర్టీసీ టు డిపోకు చెందిన జేబీఎం సూపర్ లగ్జరీ బస్సు డిపో నుండి బయటకు వస్తున్న క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు బ్యాటరీ నుండి పొగలు రావడం గమనించిన డ్రైవర్ అప్రమత్తమై సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వెంటనే మంటలను ఆర్పీ చేశారు.

జేబీఎన్ బస్సులలో వరుస ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ప్రయాణికులు బెంబేలు ఎత్తుతున్నారు. గతంలో కరీంనగర్ టు డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు కరీంనగర్ దాటి హైదరాబాద్ వెళుతున్న క్రమంలో కరీంనగర్ నుండి 15 కిలోమీటర్ల దూరం వెళ్లగానే మంటలు వేయడంతో డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను కిందికి దింపి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈరోజు కూడా కరీంనగర్ టు డిపో కు చెందిన సూపర్ లగ్జరీ బస్సు అలాంటి ప్రమాదము జరిగింది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.

మంగళవారం రోజున కరీంనగర్ నుండి నిజాంబాద్ వెళ్తున్న నిజాంబాద్ టు డిపోకు సంబంధించిన బస్సు సాంకేతిక లోపంతో కోర్టు వద్ద నిలిచిపోయింది, రిపేరు చేయడానికి సుమారు 10 గంటల సమయం పట్టింది. అదే రోజు కోర్టు సర్కిల్ వద్ద మరో సూపర్ ఎక్స్ప్రెస్ జేబీఎం బస్సు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది, ఈ బస్సును తరలించే క్రమములో

మరో బస్సు కూడా నిలిచిపోవడం గమనార్హం. వరుస బస్సులు సాంకేతిక లోపం వల్ల నిలిచిపోవడం అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం చూస్తుంటే బస్సులను మెయింటెనెన్స్ చేయడం లేదని ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

అధికారుల అలసత్వమే కారణమా

ప్రతిరోజు ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చి, తిరిగి తీసుకువచ్చే బస్సులు ఇలా వరుస ప్రమాదాలు చోటు చేసుకోవడం చూస్తుంటే అధికారులు వీటిని పూర్తిస్థాయిలో తనిఖీలు చేయడం లేదా అనిపిస్తుంది.

జేబీఎం బస్సులను తయారుచేసిన సంస్థ వాటికి సంబంధించిన లోపాలు, రిపేర్లకు సంబంధించిన టెక్నీషియన్లను అందుబాటులో ఉంచినా కూడా వారికి కూడా అర్థం కాని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అని టెక్నీషియన్స్ అంటున్నారు. గతంలోనిలిపి ఉంచిన వాహనం నుండి మంటలు చెడరేయడంతో టెక్నీషియన్స్ వచ్చేంతవరకు కరీంనగర్ డిపోకు సంబంధించిన బస్సులను పూర్తిస్థాయిలో నిలిపివేశారు

వరుస ప్రమాదాలకు కారణమైన కారణాలను తెలుసుకొని బస్సులను రిపేరు చేసి వాటికి సంబంధించిన లోపాలు సరిచేసి నడిపించాలని ప్రయాణీకులు కోరుతున్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN