Yellareddypet: బుగ్గరాజేశ్వర తండాలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు!

Yellareddypet: ఎల్లారెడ్డిపేట మండలంలోని బుగ్గరాజేశ్వర తండాలో బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ బీమా పథకాలు, సైబర్ మోసాలపై గ్రామ ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు.

KALEEM, SIRICILLA
Published on: 5 Nov 2026 1:25 PM IST
Yellareddypet
X

Yellareddypet: బుగ్గరాజేశ్వర తండాలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు!

Yellareddypet: మండలంలోని బుగ్గరాజేశ్వర తండా గ్రామంలో ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ స్కీమ్స్ శాచురేషన్ క్యాంపెయిన్‌లో భాగంగా గ్రామ ప్రజలకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అజ్మీర తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు ప్రజలకు ఆర్థిక నిర్వహణ, పొదుపు అలవాట్లు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా LDO చేతన్ గోరెఖరు, LDM రాజీవ్ కుమార్, ఎల్లారెడ్డిపేట TGB శాఖ మేనేజర్, IOB బ్యాంకు మేనేజర్, బిజినెస్ కరస్పాండెంట్, VIDS CFL కౌన్సిలర్లు వి. శ్రీకాంత్, ఎం. శ్రావణ్ కుమార్, కె. ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజలు తమ ఆదాయాన్ని సక్రమంగా వినియోగించుకోవడంతో పాటు భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు అలవర్చుకోవాలని సూచించారు.

బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), సుకన్య సమృద్ధి యోజన (SSY), అటల్ పెన్షన్ యోజన (APY) వంటి పథకాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.

అదేవిధంగా రోజురోజుకు పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకింగ్ లావాదేవీల సమయంలో జాగ్రత్తలు పాటించాలని బ్యాంకు అధికారులు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్, సర్పంచ్ అజ్మీర తిరుపతి నాయక్, వార్డు సభ్యురాలు శైలజ, మహిళా సంఘం VO రమతో పాటు నాజం, దేవేందర్ రెడ్డి, రాజు, దేవ, గణపతి, మంజుల, లక్ష్మి, సంత లలిత, కమల, లత తదితరులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA