Jammikunta: పత్తి మార్కెట్‌లో రైతులకు నిరాశ.. రూ.10 వేల ధర ఎప్పుడు?

Jammikunta: జమ్మికుంట పత్తి మార్కెట్‌కు 105 వాహనాల్లో పత్తి రాగా, గరిష్ఠంగా రూ.8,970 ధర పలికింది. క్వింటాల్‌కు రూ.10 వేల ధర వస్తుందని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది.

GANESH, JAMMIKUNTA
Published on: 23 Nov 2026 11:05 AM IST
Jammikunta
X

Jammikunta: పత్తి మార్కెట్‌లో రైతులకు నిరాశ.. రూ.10 వేల ధర ఎప్పుడు?

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌కు నేడు 105 వాహనాల్లో పత్తి రావడం జరిగింది. మార్కెట్‌లో పత్తికి గరిష్ఠంగా రూ.8,970, రూ.8,850, రూ.8,800 ధరలు పలికాయి. అయితే పత్తికి క్వింటాల్‌కు రూ.10 వేల ధర వస్తుందని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది.

పెట్టుబడులు, కూలీ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో రూ.10 వేల ధర వస్తేనే తమకు గిట్టుబాటు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఖరీదుదారులు తమ ఇష్టానుసారంగా ధరలు నిర్ణయిస్తున్నారనే అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు.

రైతుల కష్టానికి తగిన గిట్టుబాటు ధర ఎప్పుడు? ఖరీదుదారుల తీరుపై అధికారులు స్పందిస్తారా? రైతులకు న్యాయం జరిగేలా మార్కెట్ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్పర్సన్ మార్కెట్ కార్యదర్శి సిబ్బంది రైతులు ఖరీదారులు అధికారులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA