Karimnagar: ఎండిపోతున్న వరి పంటను కాపాడుకునేందుకు రైతు ఆరాటం!

Karimnagar: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామంలో నీరు లేక ఎండిపోతున్న వరి పంట. ట్యాంకర్లతో నీటిని అందిస్తూ పంటను కాపాడుకునేందుకు రైతు గడిపల్లి రవీందర్ తాపత్రయం.

ANJANEYULU, MANAKONDURU
Published on: 31 Oct 2026 7:33 AM IST
Karimnagar
X

Karimnagar: ఎండిపోతున్న వరి పంటను కాపాడుకునేందుకు రైతు ఆరాటం!

Karimnagar: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామంలో పంటను కాపాడుకునేందుకు ఓ రైతు పడుతున్న కష్టాలు అందరినీ కలచివేస్తున్నాయి.

నీరు లేక ఎండిపోతున్న వరి పంటను చూసి తట్టుకోలేక చెంజర్ల గ్రామానికి చెందిన రైతు గడిపల్లి రవీందర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి పొలానికి అందిస్తూ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట కళ్లముందే ఎండిపోతుండటంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను కాపాడుకునేందుకు రైతు చేస్తున్న ఈ ప్రయత్నం వ్యవసాయంలో అన్నదాత పడుతున్న కష్టాలకు అద్దం పడుతోంది.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU