Chandurthi: జోగాపూర్‌లో యాసంగి సాగుపై రైతులకు అవగాహన

Chandurthi: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్‌లో ఎల్‌నినో దృష్ట్యా యాసంగి సాగు, ఆరుతడి పంటల ఎంపికపై రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు.

BABU, VEMULAWADA
Published on: 31 Oct 2026 4:27 PM IST
Chandurthi
X

Chandurthi: జోగాపూర్‌లో యాసంగి సాగుపై రైతులకు అవగాహన

రాజన్న సిరిసిల్ల జిల్లా: చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో యాసంగి సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని అధిక నీటి అవసరమున్న పంటల సాగుపై పునరాలోచించాలని, పరిస్థితులకు అనుగుణంగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, స్వల్పకాలిక పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.

నీటి వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో క్రాప్ హాలిడే అంశాన్ని పరిశీలించాలని, అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని రైతులకు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శాహానాజ్ సమీర్ గారు, Pacs Chandurthi చైర్మన్ ప్రభాకర్ గారు, మండల వ్యవసాయ అధికారి దుర్గరాజు గారు, MPDO రాధ గారు, Electricity AE పృథ్వీ గారు, వ్యవసాయ విస్తరణ అధికారి శారద గారు, విద్యుత్, నీటిపారుదల, ఉపాధి హామీ మరియు వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA