Peddapalli: పందిళ్ళ గ్రామంలో నేత్రదానంతో ఆదర్శంగా నిలిచిన కుటుంబం!
Peddapalli: పెద్దపల్లి జిల్లా పందిళ్ళ గ్రామంలో నేత్రదానంతో ఆదర్శంగా నిలిచిన వీణవంక పోచాలు కుటుంబం. మృతుని కార్నియాలను సేకరించి ఇద్దరికీ చూపు ప్రసాదించిన వైనం.
Peddapalli: పందిళ్ళ గ్రామంలో నేత్రదానంతో ఆదర్శంగా నిలిచిన కుటుంబం!
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ పందిళ్ళ గ్రామానికి చెందిన వీణవంక పోచాలు ఇటీవల మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులు నేత్రదానం చేసి ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపారు.
గ్రామ నివాసి వీణవంక పోచాలు మరణించడంతో, సామాజిక కార్యకర్త ఆడెపు భాస్కర్ మృతుడి కుటుంబ సభ్యులకు నేత్రదానం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. దీనికి స్పందించిన కుటుంబ సభ్యులు నేత్రదానానికి సంపూర్ణ అంగీకారం తెలిపారు. అనంతరం వాసన్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ చందు సహకారంతో కార్నియాలను సేకరించి, భద్రపరిచి సికింద్రాబాద్ ఐ బ్యాంక్‌కు పంపించారు. పందిళ్ళ గ్రామంలోనే ఇది తొలి నేత్రదానం కావడం విశేషం.
ఈ నేత్రదానం ద్వారా ఇద్దరు అంధులకు చూపు ప్రసాదించిన మృతుని భార్య మణెమ్మ, కుమారుడు-కోడలు రాజు-రక్షిత, కుమార్తెలు-అల్లుళ్లు కోమల-రాజు, సుమలత-కుమారస్వామి, మనుమలు కార్తికేయ, ఆత్రేయలను సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు, గ్రామ పెద్దలు ప్రత్యేకంగా అభినందించి ధన్యవాదాలు తెలిపారు.
అభినందించిన వారిలో సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి, ప్రచార కార్యదర్శి వాసు, గౌరవ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, ముఖ్య సలహాదారులు రమేష్, జిల్లా గౌరవ అధ్యక్షులు చంద్రమౌళి, క్యాతం మల్లేశం తదితరులు ఉన్నారు.




