Vemulawada: రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్ గరిమ

Vemulawada: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అన్నదాన సత్రం, 80 ఫీట్ల రోడ్డు పనులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 5 Nov 2026 7:07 PM IST
Vemulawada
X

Vemulawada: రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్ గరిమ

వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. గురువారం వేములవాడలో వీటీఏడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న రాజన్న ఆలయ అభివృద్ధి పనులు, నిత్యాన్నదాన సత్రం, బద్ది పోచమ్మ ఆలయ నిర్మాణం, 80 ఫీట్ల రోడ్డు పనులను ఆర్ అండ్ బీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి పనికి సంబంధించి కూలీల సంఖ్యను పెంచి, నిర్ణీత ప్రణాళిక ప్రకారం పనులను శరవేగంగా పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల పురోగతిని ఆర్ అండ్ బీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రాజన్న ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు నిర్మిస్తున్న 80 ఫీట్ల రోడ్డు పనులను పరిశీలించిన కలెక్టర్.. పనుల పురోగతిపై మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ పర్యటనలో ఆలయ ఈఓ రమాదేవి, ఆర్డీఓ కేఎస్‌బీ కుమారి, ఆర్ అండ్ బీ ఈఈ భీమ్లానాయక్, మున్సిపల్ కమిషనర్ లోకేష్, ఆర్ అండ్ బీ డీఈ శాంతయ్య, తహసీల్దార్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA